SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ఎమ్మార్వోను కలిసి న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రేవూరి వేణు గోపాల్

July 14, 2026 | తెలంగాణ

జ నం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు లో SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియకుచివరి రోజు కావడంతో, మండలంలో వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోందో తెలుసుకునేందుకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీ నందలూరు మండల కో-క్లస్టర్ ఇంచార్జ్ చుక్కా యానాది సోమవారం మండల ఎమ్మార్వోని మర్యాద పూర్వకంగా కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధిం చిన విధానాలను వివ రించారు.ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటరు వివరాలను ఒకసారి పరి శీలించుకుని, ఏవైనా మార్పులు అవసరమైతే ఈనెల 14వ తేదీలోపు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసు కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ పెంచలయ్య ,కో యూనిట్ ఇన్చార్జ్ ఆవులరమేష్ ,నీటి సంఘం అధ్యక్షులు చుక్కా కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper