ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

July 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూలై 14,అచ్యుతాపురం : రాష్ట్రంలో షాపులు,పరిశ్రమల వద్ద పనిచేస్తున్న ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఈనెల 16న విశాఖపట్నంలో జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని అనకాపల్లి జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈరోజు అనకాపల్లి దొడ్డి రామనాయుడు భవనంలో జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు మాట్లాడుతూ ముఠా కార్మికులు తన శ్రమను నమ్ముకొని పనిచేస్తున్నారని, అధిక బరువులు మోయడంతో తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని, ముఠా కార్మికులకు ఎటువంటి చట్టం లేకపోవడంతో వయస్సు మళ్ళినప్పుడు వారిని ఆదుకునే దిక్కు లేదని,కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేస్తామని హామీ ఇచ్చిందని. రెండు సంవత్సరాల గడుస్తున్న ఈరోజుకి ఎటువంటి అడుగు ముందుకు పడలేదని,ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ సదస్సుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఆధ్యక్షుడు అర్ .రాము, జిల్లా కార్యదర్శి కే. అప్పలరాజు, కమిటీ సభ్యులు మజ్జి శంకర్రావు, అర్.అప్పలనాయుడు,నాగ అప్పారావు,నాగ నాయుడు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper