ఓటరు నమోదు ప్రతిఒక్కరి బాధ్యత
జనం న్యూస్ జూలై 15 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా )బీబీపేట మండలం మంగళవారం గ్రామపంచాయతీ పరిధిలోనీ చావిడి వద్ద గల ఓటరు నమోదు కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రశాంత్ కుమార్, స్వయంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామప్రజల యొక్క సర్ ఫారములు నింపుతూ ప్రజలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ప్రతిఒక్కరు ఓటు హక్కును కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని 2002, 2005 ఓటరు జాబితాకు అనుగుణంగా ఎన్యూమరేషన్ దరఖాస్తులు అందజేయాలని బి ఎల్ ఓ లను కోరారు.