వేమన సతీష్ నూతన గృహాన్ని సందర్శించిన :-యల్లటూరు శ్రీనివాస రాజు

July 15, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. జూలై 15కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని స్థానిక విద్యానగర్‌లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అమెరికా తానా (TANA) మాజీ అధ్య క్షులు వేమన సతీష్ నూతన గృహాన్ని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్ల టూరు శ్రీనివాస రాజు మర్యాద పూర్వకంగా సందర్శించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన గృహాన్ని సందర్శించిన యల్ల టూరు శ్రీనివాస రాజు వేమన సతీష్ కి అభినందనలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. సమాజ సేవలోనూ, ప్రజా జీవితంలోనూ ఆయన మరింత విజయాలు సాధించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, విశ్రాంత పోలీసు అధికారి కడిమెల్ల శ్రీనివాసరాజు తదితర ప్రముఖులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియ జేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభి మానులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper