ముద్రగడ భౌతికకాయానికి నివాళులుమంత్రులు, నాయకుల సందర్శన

July 15, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)కిర్లంపూడిలో కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, శాసనసభ వ్యవహారాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు తుమ్మల బాబు, ఆకుల రామకృష్ణ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఆకుమర్తి చిన్నా తదితర నాయకులు ముద్రగడ భౌతికకాయం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ముద్రగడ సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాజ సేవలో ఆయన పోషించిన పాత్రను గుర్తుచేసుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper