తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫౌండషన్ ఆధ్వర్యంలో
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి. బి వీరేశం జులై 15. 07. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలో యూనియన్ సమావేశం ఘన విజయంజహీరాబాద్ నియోజకవర్గంలోని మహేంద్ర కాలనీ కమిటీ హాల్‌లో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల యూనియన్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పలువురు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలు, సంస్థ బలోపేతం, ఐక్యతపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫౌండేషన్ మండల అధ్యక్షుడు రామన్న హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జర్నలిస్టులు సమాజానికి వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంస్థలు ఐక్యంగా పనిచేయాలని, వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.సమావేశంలో జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ హాజరైన అతిథులు, జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.