ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు ప్రతి అర్హత కలిగిన ఓటరు ఫారం సమర్పించి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపు
జనం న్యూస్ | జూలై 17 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఆదేశాల మేరకు కేపీహెచ్‌బీ వసంతనగర్ డివిజన్‌లో భారత ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందలపు సాయిబాబు చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌లను బీఎల్‌వోలతో కలిసి సందర్శించిన నాయకులు ప్రజలకు దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు. ఫారాలను సక్రమంగా ఎలా పూరించాలో వివరించి, ఓటర్ల సందేహాలకు సమాధానాలు ఇస్తూ అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో ఎక్కువ మంది ప్రజలు అందుబాటులో ఉంటారని పేర్కొన్న వారు, ప్రతి కాలనీలోని కమ్యూనిటీ హాళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ఫారాన్ని పూరించి సమర్పించి, తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వసంతనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిలారి బాబు, కాంగ్రెస్ నాయకులు కాజా నవీన్, రాము, రత్నాకర్ బాబు, భీమేశ్వర్ చౌదరి, శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, సురేష్, చిలుకూరి గోవిందరాజు, కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.