బట్టాపూర్లో అక్రమ ఇసుక మాఫియాపై ఉక్కుపాదం40 ట్రాక్టర్ల మేర ఇసుక నిల్వలు సీజ్.. రెవెన్యూకు అప్పగింత
జనం న్యూస్ ఆగస్టు 3: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో భారీ ఎత్తున అక్రమంగా ఇసుక నిల్వలు చేసినట్లు అందిన సమాచారం మేరకు ఆదివారం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో సుమారు 40 ట్రాక్టర్ల మేర అక్రమ ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించి వాటిని వెంటనే సీజ్ చేశారు. ఈ చర్యలో జీపీఓ వెంకటేష్, ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.సీజ్ చేసిన ఇసుక నిల్వలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం రెవెన్యూ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై రాజేశ్వర్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు