బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం
జనం న్యూస్ ; 3 ఆగస్టు సోమవా*రం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట పట్టణంలోని బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీకు వరకు 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది, భారతదేశన్ని మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ కు దూరంగా ఉంచడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప జాతీయ ఉద్యమంలో భాగంగా ఈరోజు సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ హైమావతి కారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు అనంతరం కలెక్టర్ గారు సంస్థ సభ్యులతో కలిసి గోడ పత్రికను విడుదల చేశారు. అలాగే కలెక్టర్ ఆఫీసర్స్ అందరి చేత వ్యసన ముక్తి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సంస్థ నిర్వాహకురాలు బి కే భవానీ మాట్లాడుతూ మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ వలన యువత నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవితం, సామరస్య కుటుంబం, యువతను రక్షించి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం మరియు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఈ 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కావున సిద్దిపేట ప్రజలందరూ ఈ యొక్క మహా ఉద్యమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు చుట్టుపక్కల వారికి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ వారి చేత ప్రతిజ్ఞ చేయించడం కోసం డిజిటల్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ప్రతిజ్ఞని నిర్వహించి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన యువశక్తిని నిర్మించడం మరియు దేశాన్ని, రాష్ట్రాన్ని, సిద్దిపేట జిల్లాను వ్యసన రహితంగా తయారు చేయాలని ప్రజలను కోరారు, ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి బి కే స్వప్న, సభ్యులు ఓంకారం, బిందు, బి రాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు