ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ఎస్టీయు ధ్యేయం:- అల్లం అశోక్ కుమార్
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా పెనగలూరు లోని నల్లపురెడ్డి పల్లె అరుంధతి వాడ పాఠశాల మరియు అంగన్వాడి, కేసీ ఎస్టీ కాలనీ, గాంధీ నగర్ ఎస్టీ కాలనీ ల లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోపాధ్యాయ సంఘము ( ఎస్టీయు ఏపీ) మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మండల విద్యా శాఖాధికారి ఎమ్. గిరి వరదయ్య, కొండూరు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులు వెంకట సుబ్బయ్య, పెనగలూరు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అల్లం మహేశ్వర నాయుడు చేతుల మీదుగా విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి మరియు పెనగలూరు హైస్కూలులో గణిత స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్న అల్లం అశోక్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ మరియు పెనగలూరు హైస్కూలు సోషియల్ ఉపాధ్యాయులు జీ. శ్రీని వాసులు, రాష్ట్ర కౌన్సిలర్ మరియు పెనగలూరు ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. యానాదయ్యల సంయుక్త సౌజన్యంతో చేపట్టిన విద్యా సామగ్రి వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యా శాఖాధికారి గిరివరదయ్య మాట్లాడుతూ మండలంలోని రాష్ట్రోపాధ్యాయ సంఘ నాయకులు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయంగా కార్య క్రమాలు నిర్వహిస్తు న్నారని, అందులో భాగంగా పేద విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాలు, ఎక్కాల పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, ఎరేజర్లు, బలపాలు మొదలైన విద్యా సామగ్రి అందజేయడం ముదావహమని, దీనికి ఆర్థిక సహకారం అందించిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు. పెనగలూరు, కొండూరు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపా ధ్యాయులు అల్లం మహేశ్వర నాయుడు, వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం లోేనే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఎస్టీయుఏపీ ముందంజలో వుంటోందని కొనియాడారు. ఎస్టీయుఏపీ రాష్ట్ర కార్యదర్శి అల్లం అశోక్ కుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్లు స్వామినాథం, యానాదయ్య, శ్రీనివాసులు, మాజీ జిల్లా అధ్యక్షుడు పిల్లి రామకృష్ణ, జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి, జయ రామయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున,రాము,ఉపాధ్యా యులు, గ్రామస్థులు, తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.