ప్రజలకు – ప్రజాప్రతినిధులకు మధ్య వారధిగా మీడియా సేవలు అమూల్యం బండి రమేష్

August 7, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి 10 టీవీ ప్రతినిధి శ్రీ హరి జన్మదినం సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన కేక్ కట్ చేయించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో, ప్రజలకు – రాజకీయ నాయకులకు మధ్య వారధిగా మీడియా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. సమాజాభివృద్ధిలో మీడియా సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఎదురైనా మీడియా ప్రతినిధులు తన దృష్టికి తీసుకువస్తే, సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని బండి రమేష్ హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, లక్ష్మణ్ గౌడ్, పిడికిటి గోపాల్ చౌదరి, బీసీ నాయకులు తెల్ల హరికృష్ణ, విలేకరులు రాకేష్, సత్య, భాను, అనిల్, రంజిత్, శంకర్, కూకట్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు నాగార్జున, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు రమణ, మహేష్, వాసు, కృష్ణవేణి, జ్యోతి తదితరులు పాల్గొని శ్రీ హరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper