ఆగస్టు 10 న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి

August 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్, గుండాల ఆగస్ట్. 9.పి. యాదగిరి ఇటిక్యాల పరశురాములుCITU మండల నాయకులయాదాద్రి భువనగిరి జిల్లా గుండాల ఆగస్టు 10 న నిర్వహించ తలపెట్టిన.జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని సిఐటియు గుండాల మండల నాయకులు ఇటికాల పరశురాములు పిలుపునిచ్చారు.ఆదివారం ఆయన గుండాలలో పత్రికా ప్రకటన విడుదల చేసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,రైతు,వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కార్మిక రైతు వ్యవసాయ కార్మికుల హక్కులపై తీవ్ర దాడి చేస్తుందని విమర్శించారు.కార్పొరేట్ లాభల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచి,కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ,లేబర్ కోడ్లు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో వ్యవసాయ రంగాన్ని సంక్షేభంలోకి నెట్టివేస్తూ గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్న బీజేపీ విధానాలను దేశ ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.రైతుల పంటలకు ప్రభుత్వం కొనుగోలు గ్యారెంటి కల్పించాలని,వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టడం అంటే వ్యవసాయ రంగాన్ని నీరుకార్చడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.నేటికీ రుణాలు,ఎరువులు,విత్తనాలు వంటి సమస్యలపై రైతులు ఆందోళనలో ఉన్నారని,భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం జరిగే జైల్ భరో కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కార్మికులు,రైతులు ప్రజలు అధిక సంఖ్యలో కదలి రావాలని పిలుపునిచ్చారు.

🌐 Select Language:
📰 ePaper