ఇంటింటా జాతీయ జెండాను ఎగరేయండి…

August 10, 2026 | తెలంగాణ

—మాజీ ఎమ్మెల్యే అరుణాతార

బిచ్కుంద ఆగస్టు 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా ​బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపాలిటీలో మన జాతీయ పతాకం దేశానికి గర్వకారణమని, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే అరుణాతార కోరారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్రివర్ణ పతాకం మనకు నిరంతర ప్రేరణ శక్తి అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి, దేశభక్తిని మరియు జాతీయ సమైక్యతను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలన్నారు.​ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేవన్, బిచ్కుంద మండల అధ్యక్షుడు విష్ణు, సునీత రాథోడ్, గంగరాజు, దన్నూర్ విఠల్, శ్రీనివాస్, సందీప్ తోట, పత్తి రమేష్, మల్లికార్జున దేశాయ్, రామాగౌడ్, శివాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper