పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి
జనం న్యూస్ 19 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం పెండింగ్ బిల్లుల చెల్లింపుకు ప్రభుత్వం సిద్ధం పాలమూరు ఉమ్మడి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలకు సూచించిన ముఖ్యమంత్రి లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇది శుభ పరిణామన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యమంత్రికి స్వయంగా ధన్యవాదాలు తెలిపిన వీర్లపల్లి శంకర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వయంగా సూచించారు. మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు జూపల్లి కృష్ణారావ వాకిటి శ్రీహరి ప్రభుత్వ విప్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి మధుసూదన్ రెడ్డి మేఘారెడ్డి రాకేష్ రెడ్డి వంశీకృష్ణ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడినట్లు చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లు వీర్లపల్లి శంకర్ తెలిపారు జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం పేర్కొన్నారని ఆయన స్పష్టం చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఇతర సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు జిల్లాలో సమస్యల పరిష్కారం పనుల్లో పురోగతిపై మంత్రుల ఆధ్వర్యంలో తరచూ తనను కలవాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఇ భేటీ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర భద్రత సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ సంతోషం వ్యక్తం చేశారు యుద్ధ ప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు తీరుపై స్పందించి భూసేకరణ వాటికి చెల్లించాల్సిన బిల్లులతో పాటు పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడం ఎంతో శుభ పరిణామం అని తెలిపారు లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ఒక్కొక్కటిగా సమస్యలు తీరిపోతున్నాయని వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు