సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా

August 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా కూకట్‌పల్లి తూర్పు కమాన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గొట్టిముక్కల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ధైర్యంగా పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన వీరత్వం, పోరాట స్ఫూర్తి, ప్రజాసేవా భావం నేటి తరాలకు ఎప్పటికీ ఆదర్శప్రాయమని అన్నారు.సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ సాగించిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. మహనీయుని జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటూ నినదించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కావేటి నాగార్జున, మేకల రమేష్, గూడెపు నాగరాజు, కృష్ణవేణి, జ్యోతి, నర్సింగ్ గౌడ్, చెదురువల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper