సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా

August 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కత్తి పట్టి పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు జనతానగర్, మూసాపేటలో ఘనంగా నిర్వహించారు. శేఖర్ గౌడ్, బి-బ్లాక్ అధ్యక్షులు తూము వేణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి బండి రమేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహుజన రాజ్య స్థాపన కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.బహుజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ గౌరవిస్తోందని బండి రమేష్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఏ-బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు కార్క్ పెంటయ్య, డివిజన్ అధ్యక్షులు తూము సంతోష్, కలికోట శంకర్, సీనియర్ నాయకులు సునీల్, నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు సలీం, సీనియర్ నాయకులు చున్నుపాషా, కేబుల్ శ్రీను, మధు, సప్పిడి భాస్కర్, సచిన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper