జహీరాబాద్ స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్

August 18, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్ తేదీ 18-08-2026 జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని 2028 మార్చి నాటికి పూర్తి చేసి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, పీయూష్ గోయల్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. 3,245 ఎకరాల్లో రూ. 15 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఈ ప్రాజెక్టును వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

🌐 Select Language:
📰 ePaper