సబ్సిడీ ద్వారా జిలుగు విత్తనాలు పంపిణీ
జనం న్యూస్ మే 20 చిలిపి చెడు మండల ప్రతినిధి వ్యవసాయ శాఖ ద్వారా జీలుగు విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయడం జరిగింది అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడడం వల్ల తగ్గుతున్న భూసారాన్ని పెంచే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జీలుగు విత్తనాల ప్రయోజనాలు భూసారం పెరుగుదల ఈ విత్తనాలను చల్లి, 35 నుంచి 45 రోజుల తర్వాత పూత రాకముందే నేలలో కలియ దున్నినట్లయితే, సుమారు 12 టన్నుల జీవ పదార్థం నేలలోకి చేరుతుంది. దీనివల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరిగి, భూమి సారవంతమవుతుంది సూక్ష్మజీవుల పెంపకంజీవపదార్థం పెరగడం వల్ల నేలలో మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాముల సంఖ్య పెరుగుతుంది.తెగుళ్ల నివారణ: పంట మార్పిడి జరగడం వల్ల వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, సుడిదోమ వంటి తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది ఎరువుల వాడకం తగ్గింపు: జీలుగు మొక్క గాలిలోని నత్రజనిని నేలలో నిక్షిప్తం చేయడం ద్వారా యూరియా వంటి రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందినీటి నిల్వ సామర్థ్యం: ఈ పద్ధతి వల్ల నేల నీటిని నిల్వ చేసుకునే శక్తి పెరుగుతుంది.ఈ కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్ గౌడ్, ఏఈవోలు అనిత, కృష్ణవేణి మరియు రైతులు పాల్గొన్నారు