ఎస్సీ లపై జరిగిన దౌర్జన్యాలు పై మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన చెల్లి అశోక్.
జనం న్యూస్ మే 23 (ముమ్మిడివరం ప్రతినిధి ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్ మాట్లాడుతూ గత వైయస్సార్ ప్రభుత్వం లో దళితులపై అనేకమైన దాడులు చేయడం జరిగింది 2024 లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా దళితులపై దాడులు జరగడం లేదు, సంక్షేమం అభివృద్ధి సమానంగా చూసుకుంటూ ప్రత్యేకంగా దళితులకు ఏమైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు జరగడానికి కృషి చేస్తుందని మరి గత ప్రభుత్వంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ని 32 చోట్ల కత్తితో గాయాలు చేసి చంపేసి వాళ్లు ఇంటి దగ్గరకు డోర్ డెలివరీ చేస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడం గానీ పార్టీ నుండి తొలగించడం గాని చేయలేదు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దళితులందరూ ముక్తకంఠంతో అనంతబాబుని అరెస్టు చేయాలని ధర్నాలు రాస్తారోకోలు చేస్తే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయడం జరిగింది. రెండవది డాక్టర్ సుధాకర్ కరోనాలో మాస్క్ కిట్లు కోసం అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డుమీద రెండు చేతులు వెనక్కి కట్టి అతనిని కొట్టి పిచ్చివాడిగా ముద్ర వేసి అతడు ప్రత్యేకంగా చనిపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇప్పటివరకు బురద జల్లుకుంటూ వస్తున్నారు కనీసం వైయస్సార్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితమయ్యి ఈరోజు వరకు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు మీరు వైయస్సార్ ప్రభుత్వంలో దళితులకు ఎక్కడ న్యాయం చేశారు ఉన్న దళిత పథకాలన్నీ తీసివేసి దళితులకు అన్యాయం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు సుఖసంతోషాలతో ఉన్నారు ఈరోజు యువ గళం యువ సారథి నారా లోకేష్ ఆధ్వర్యంలో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దళితుల పథకాలన్నీ అమలు చేస్తున్నారని, వైయస్సార్ ప్రభుత్వంలో దళిత పథకాలు తీసివేసినవన్నీ మరల అమలు చేస్తున్నారని రాబోయే కాలంలో ఈ దళితులంతా కలిసి వైయస్సార్ ప్రభుత్వాన్ని నామరూపం లేకుండా చేస్తామని అశోక్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జక్కల ప్రసాద్, తాడి నరసింహారావు, గొలకోటి దొరబాబు కట్టా సత్తిబాబు, అర్ధాని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణ కుమార్, వెంట్రు సుధీర్, మిమ్మితి చిరంజీవి, గొల్లపల్లి గోపి, విళ్ళ వీరస్వామి నాయుడు యాళ్ల ఉదయ్, దాట్ల బాబు, గుబ్బల మూర్తి,రెడ్డి శ్రీను, రెడ్డి సుబ్బారావు, సానబోయిన సోమయ్య, జనపల్లి సత్యనారాయణ మాస్టర్, కాకి మాణిక్యం, మొదలగు వారు పాల్గొన్నారు.