అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అన్న చందంగా ప్రభుత్వఆసుపత్రి తీరు
జనం న్యూస్ 27 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవల వైఫల్యం బాధితుడి ఆవేదన ఆసుపత్రికి రోగులు వచ్చే వారికీ మౌలిక వసతులు లేక చేతులపై రోగిని తీసుకోని వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు,”గద్వాల ఏరియఆసుపత్రికి దేవమ్మ అనే ఆశా వర్కర్ చికిత్స నిమిత్తం ఇక్కడికి తీసుకువచ్చాను. ఆమెకు కడుపునొప్పి వచ్చిందని చెప్పేసి, గద్వాల ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత టెస్టులు రాశారు. ఆ టెస్టులకు సంబంధించి ‘అబ్డామిన్’ స్కానింగ్ చేయించుకోవాలని డాక్టర్స్ స్లిప్ రాశారు.అబ్డామిన్ స్కానింగ్ సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారంటే, స్కానింగ్ చేసేటటువంటి వారు లేరండి. వాళ్ళు నెల రోజులు లీవ్‌లో వెళ్ళిపోయరానే సమాధానం చెబుతున్నారు. నెల రోజులు లీవ్‌లో వెళ్ళిపోతే మరి ఎవరైనా ఆల్టర్నేట్ పెట్టొచ్చు కదా అంటే ఆ ఛాయిస్ లేదండని డాక్టర్స్ సమాధానం ఇస్తున్నారు. ఇక్కడైతే వేరే వారికీ ఆల్టర్నెట్ చేసే అవకాశం లేదని ఆర్ ఎం ఓ హేమలత మేడం చెప్తున్నారు. ఆర్థికంగా లేని పేద వారు ప్రభుత్వం ఆసుపత్రి కి వస్తుంటారని ఇప్పుడు సిటీ స్కాన్ స్కానింగ్ రాసినారు. అది వచ్చేసి ₹5,000 అవుతుందని అంటున్నారు.ఇక్కడ మన దగ్గర ఆసుపత్రిలో అన్ని ఎక్విప్‌మెంట్స్ పెట్టుకొని కూడా ఒకరికి లీవ్ ఇచ్చిన తర్వాత ఇంకొకరు ఎవరైనా ఆల్టర్నేట్ చేయకుండా… ‘అక్కడ మీరు కర్నూలుకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి’ అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. ప్రజెంట్ మేమున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నాము. గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు విన్నవించుకుంటున్నాము.దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మిగతా కలెక్టర్, స్పందించి, దయచేసి ఇక్కడికి ఎవరైనా రిక్రూట్‌మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము.