ట్యాంకర్ల ద్వారా త్రాగు నీరు సరఫరా

జనం న్యూస్ మే 23 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలోని అడవిపేట, తామరచెరువు గ్రామాల ప్రజ లకు ఓఎన్నిసి సంస్థ సహకారంతో మంగళవారం ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసినట్లు ఎంపిడిఓ రాజేశ్వర్రావు తెలిపారు. ఇటీవల ఆయా గ్రామాల్లో త్రాగునీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం, సాయంత్రం రెండుపూటలా ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని, ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే క్షేత్ర స్థాయి సందర్శన చేసి సత్వర చర్యలు చూపాలని, అనదికార మోటార్లు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి జెవి సత్యన్నారాయణ, పంచాయతీ సిబ్బందిని ఎంపీడీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో కార్యదర్శి జె.వి. సత్యనారాయణ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.