రాజమహేంద్రవరంలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో బిజెపి జెండా ఆవిష్కరణ
జనం న్యూస్ ఆగస్టు 27 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ జెండా స్తూపం వద్ద జెండా ఆవిష్కరణను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.