జోగులాంబ గద్వాల జిల్లాకు తక్షణమే నవోదయ పాఠశాల మంజూరు చేయాలి
జనం న్యూస్ న్యూస్ 31 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలి టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్ గద్వాల: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ప్రెస్మీట్లో రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్ పాల్గొని జోగులాంబ గద్వాల జిల్లాకు తక్షణమే నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లాలోని నిరుపేదలు, రైతులు, రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ పాఠశాల ఎంతో అవసరమని ప్రవీణ్ రాజ్ పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంలో నవోదయ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని జిల్లాకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ లు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి జోగులాంబ గద్వాల జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరయ్యేలా కృషి చేయాలని కొమ్ముల ప్రవీణ్ రాజ్ కోరారు. పేద రైతు రైతు కూలీల కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ పాఠశాల ఏర్పాటు అత్యవసరమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి కేసారం సిద్దు నాయుడు ఉపాధ్యక్షులు పీజీకే గోవిందరాజు సోషల్ మీడియా ఇన్చార్జ్ రాముడు ఐజ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ మండల ఉపాధ్యక్షులు బసవ స్వామి నతనెల లాజర్ బీసన్న ఆంజనేయులు నరసింహులు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.