పేదల సొంతింటి కలేప్రభుత్వ ధ్యేయం
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్భైర్ ఆగష్టు 31-08-2026 సోమవారం అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అన్నారుసోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 3వ, వార్డుకు చెందిన రేష్మ బేగం జమీల్ అబ్దుల్, హడేకారి వరలక్ష్మి, క్రీ,శే కృష్ణాజిలకు నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ భూమిపూజ చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… సొంత స్థలం ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. వార్డుల్లో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ బిల్లుల నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే జమ అవుతుందని, దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు, హరి శంకర్ నాయుడు, జములమ్మ, వార్డ్ ఆఫీసర్లు విష్ణు, నాయకులు పెద్ద రాముడు తదితరులు పాల్గొన్నారు