నాల్గవ శ్రావణశుక్రవారం సందర్భంగా శ్రీ చాముండేశ్వరి ఆలయంలో పోటెత్తిన భక్తజనం
జనం న్యూస్ సెప్టెంబర్ 4 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరి ఆలయం భక్తులకు కోరిన కోర్కెలు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న చాముండేశ్వరి దేవాలయంశ్రావణమాసం నాలుగవ శుక్రవారం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉదయం 4 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహించారు తదనంతరం పూజా కార్యక్రమాలు హారతి అమ్మవారి అష్టోత్తరం శతనామావళి పూజ జరిగింది తదనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు మంజీరా నదిలో భక్తులు స్నానమా చరించి అమ్మవారికి ముడుపులు కట్టారు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు తదనంతరం అమ్మవారికి కుంకుమార్చన లు ఓడి బియ్యం సమర్పణ చేశారు మధ్యాహ్నం 12 గంటలకు హారతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆడపడుచులందరూ శ్రావణమాసం సందర్భంగా వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు దూర ప్రదేశాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రభాకర్ శర్మ మోతిలాల్ శర్మ సుబ్రహ్మణ్య శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు