నందలూరు మండలం దుర్గాపురం ఎస్టీ కాలనీలో పోలీసుల అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లాజిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్.ఆదేశాల మేరకు,నందలూరు ఎస్.ఐ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని దుర్గాపురం ఎస్టీకాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో అవ గాహన కార్యక్రమం నిర్వ హించారు.ఈ సందర్భంగా కాలనీ ప్రజలను కలుసుకుని రాబోయే స్థానికసంస్థలఎన్నికలు,
వినాయక చవితి పండుగ సంద ర్భంగా పాటించాల్సిన నిబంధనలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు,సలహాలు అందించారు.అలాగే అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు సూచిం చారు. రోడ్డు ప్రమాదాల నివార ణకు ట్రాఫిక్ నిబంధనలు పాటిం చడం,వాహనాలను జాగ్రత్తగా నడపడం, ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వంటి అంశాలపై వగాహన, కల్పించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ రాబోయే స్థానిక ఎన్నికలు మరియు వినాయక చవితివేడుకలను,ప్రశాంతంగా,శాంతియుత వాతావరణంలో నిర్వ హించుకోవాలని నందలూరు ఎస్.ఐ మల్లి కార్జునరెడ్డి సూచించారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.