సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బండి రమేష్
జనం న్యూస్ సెప్టెంబర్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారత్ నగర్‌లోని గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యారంగ అభివృద్ధికి, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రకు సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏబీ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, తూము వేణు, ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి, టెంపుల్ చైర్మన్ మూర్తి, వెంకటేష్ యాదవ్, బాలరాజు, క్రాంతి, రమణ, సంతోష్ తదితరులతో పాటు ఉపాధ్యాయులు రత్నారావు, లక్ష్మీ, రాజారావు మరియు పలువురు పాల్గొన్నారు.