విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు
జుక్కల్ సెప్టెంబర్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బిజ్జల్వాడి, జుక్కల్, ఖండేబల్లూర్ గ్రామాల్లోని పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.80 లక్షల నిధులు వెచ్చించి నూతన అదనపు భవన నిర్మాణాలను పూర్తి చేయడం జరిగింది.ఈ నూతన అదనపు తరగతి గదులను జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ , నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు మరియు స్థానికులు పాల్గొన్నారు.