శ్రీవాణి స్కూల్‌లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
జనం న్యూస్ : 5 సెప్టెంబర్ శనివారం :సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్: శ్రీవాణి స్కూల్‌లో టీచర్స్ డే వేడుకలను శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న టీచర్స్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని చాటేందుకు ఈ రోజు ఒక ప్రత్యేకమైన సందర్భమని అన్నారు. రాధాకృష్ణన్ విద్యారంగానికి చేసిన సేవలు నేటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, మానవతా విలువలను బోధించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని సూచించారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి, మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గొప్ప బాధ్యత అని అన్నారు.టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగాలు చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా టీచర్స్ డే ప్రాముఖ్యత, తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.కాగా, టీచర్స్ డేకు ముందురోజు ఉపాధ్యాయులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని ఆటలను ఆస్వాదించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని టీచర్స్ డే వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు.