నందలూరులో ప్రధాన మంత్రి మాతృత్వ సురక్షిత్ అభియాన్ కార్యక్రమం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లానందలూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందుబుధవారం ప్రధానమంత్రి మాతృత్వసురక్షిత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్ తెలిపారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా మండలాధ్యాక్షులు ,హాస్పిటల్,డెవలప్ మెంట్ చైర్మన్, మేడ విజయ భాస్కర రెడ్డి రెడ్డి వై.ఎస్సార్ కడప- జిల్లా వైద్యాధికారి డా.యుగంధర్, జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి డా.ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.కార్య క్రమంలో డీ ఎం హెచ్ ఓ యుగంధర్ గర్భిణీ స్త్రీల తో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటు వంటి జాగ్రత్తలు,బిడ్డ ఆరోగ్య కరమైన ఎదుగుదల కొరకు పాటించా ల్సిన పద్ధతులు, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల గురించి వివరించారు.హాస్పిటల్ నందు అన్ని రికార్డులు రిజిస్టర్లు పరిశీలించి, సిబ్బంది యొక్క పనితీరు బాగుండాలని, ప్రజలకు సేవలందించడంలో ఎటువంటి అలసత్వం ఉండ రాదని సూచించారు.మేడావిజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మాయిల ప్రాముఖ్యత,వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి వివరిస్తూ బ్రూణ హత్యలు నేరం అని, స్త్రీశక్తియొక్కగొప్పతనాన్ని తెలియచేశారు.తమ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయా లని హాస్పిటల్ సిబ్బందికి సూచిస్తూఅభినందించారు. గత2సంవత్సరాలు గా మన మండల గర్భిణీలకు స్కానింగ్ పరీక్షలు స్వచ్ఛతంగా నిర్వ హిస్తున్న రాజంపేట గైనకాలజిస్ట్ డా.మస్తానమ్మని సత్కరించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న గర్భిణీలకు ఇతరులు మొత్తం 80కి పైగా మందికి మేడ విజయ భాస్కర రెడ్డి భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా.శరత్ కమల్,డా.కార్తీక్,విశ్వనాథ్డా.హీరేందర్ సింగ్, జిల్లా కార్యాలయ వైద్య సిబ్బంది ముని రెడ్డి, రాఘవేంద్ర రాజు ప్రసాద్, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.