చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

September 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూస్వామ్య వ్యవస్థపై గలమెత్తి పోరాడిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం ఐలమ్మ 41వ వర్థంతి సందర్భంగా రజక కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత ఐలమ్మ అని అన్నారు. వెట్టిచాకిరీ విధానాన్ని రూపుమాపడం లోనే కాకుండా తెలంగాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ సర్పంచ్ ఉమా రవిపాల్ నాయకులు మారపెళ్లి రవీందర్ వైనాల కుమారస్వామి చిందం రవి కుసుమ శరత్ నిమ్మల రమేష్ బాసాని రవి వరదరాజు మార్కండేయ చంద్ర మొగిలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper