ఆంధ్రప్రదేశ్

ఘనంగా భారత ప్రధానమంత్రి దామోదర్ దాస్,నరేంద్రమోదీ76వ జన్మదినోత్సవ వేడుకలు

ఘనంగా భారత ప్రధానమంత్రి దామోదర్ దాస్,నరేంద్రమోదీ76వ జన్మదినోత్సవ వేడుకలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 18. నందలూరు మండలం అరవపల్లి గ్రామంలోని శ్రీ కృష్ణా మందిరం సమీపంలో గురువారం రాత్రి భారత ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు వేడుకలను ఆశీ ర్వాద దీపం వెలిగించి, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కొండపల్లి గంగయ్య ,కుమార్ జనసేన పార్టీ జిల్లా నాయకులు గురివి గారివాసు, తెలుగు దేశం పార్టీ నాయకులు తాటి సుబ్బ రాయుడు ,గంధం గంగాధర్ నందలూరు మాజీ సర్పంచ్,రాము సురేష్ ,కొండేటి సుదర్శన్ కుర్రా మురళి, ఇర్ఫాన్ చందు తదితరులు పాల్గొని ప్రధాన మంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి మరింత కాలం,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలునిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్స రాలు పూర్తి చేసుకున్నారని తెలిపారు. అందులో 13 సంవత్సరాలు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గత 12 సంవత్సరాలుగా భారత ప్రధానమంత్రిగా దేశానికి సేవలందిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలఅమలులో విశేష కృషిచేస్తున్నారని పేర్కొన్నారు.

ఇ-పేపర్