పెద్ద ఉమంతాల్లో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు

May 23, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 23, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం లోని ఈ రోజు పెద్ద ఉమ్మెంతల్ రైతు వేదిక లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం లో భాగంగా అన్నదాతల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. ఐ .స్వర్ణలతాదేవి ప్రధాన శాస్త్రవేత్త , వరి విభాగం, రాజేంద్రనగర్. వివిధ వరి రకాల గురించి మరియు వరిలో అధిక దిగుబడి సూచనల గురించి, పంట మార్పిడి మరియు సేంద్రీయ వ్యవసాయం గురించి వివరించడం జరిగింది. డా. సి హెచ్. అనూష శాస్త్రవేత్త ( కీటక శాస్త్రం)మొక్కజొన్న పరిశోధన విభాగం గారు రైతులు సిఫార్సు మోతాదులో యూరియాను పంటలలో వాడాలని మరియు వివిధ ప్రధాన పంటలలో పాటించవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలను మరియు సాగు నీటిని ఎలా ఆదా చేసుకోవాలో వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఏ ఈ ఓ లు కే.శివ, ఇలియాస్, మహిపాల్ మరియు పెద్ద ఉమ్మెంతల్ సర్పంచ్ బి. జానకీ , ఉప సర్పంచ్ కీర్తి, అలాగే వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper