గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ డిమాండ్లకు మద్దతు ప్రకటించిన జనసేన నాయకులు :ప్రేమ కుమార్

May 23, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికులు మరియు గుత్తేదారుల అసోసియేషన్ సభ్యులు మద్దతు కోరిన వెంటనే ధర్నా ప్రదేశానికి చేరుకున్న కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కార్మికులను పరామర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, వారి న్యాయపరమైన డిమాండ్లకు పూర్తి మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ సెంట్రింగ్ కార్మికులు ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న 31 రూపాయల రేటును 51 రూపాయలకు పెంచాలని, కార్మికుల కుటుంబాల భద్రత దృష్ట్యా పది లక్షల నుండి ఇరవై లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం పెంచాలని, అలాగే కార్మిక సంక్షేమానికి అవసరమైన ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ,తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శ్రమజీవుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు, సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని, అలాంటి కార్మికుల సంక్షేమం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాకుమాను లక్ష్మణ్ రావు , కొల్లా శంకర్, బోగాదివెంకటేశ్వరావు, వేముల మహేష్ , పోలెబోయిన శ్రీనివాస్ , మాధవ్ రావు, బడే విశ్వేశ్వర్ రావు, చిట్టిబాబు మరియు జనసైనికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper