జనం న్యూస్ సెప్టెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గురువారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమ దుర్గా భవన్లో సీఎంఆర్ చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ఏబీవీ పురం నివాసి లక్ష్మి, భర్త కిషోర్ కి రూ. 43,000/- విలువైన సీఎంఆర్ చెక్కును టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలు అందేలా తన వంతు కృషి కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మయ్య, మస్తాన్ రెడ్డి, రంగా మోహన్,వాసు తదితరులు పాల్గొన్నారు.