జనం న్యూస్ 24 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణంలో గురువారం రోజున ప్రపంచ హార్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హృదయ ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో స్థానిక ఎస్ హెచ్ ఓ ఉదయ్ కిరణ్ మున్సిపల్ చైర్ పర్సన్ మరియు రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పులిపలుపుల మహేష్ మాట్లాడుతూ నేటి జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని . ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగతాగడం మద్యం సేవించడం మరియు ఇతర అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రజల్లో హృదయ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ మున్సిపల్ చైర్మన్ అంగడి ఆంజనేయులు కౌన్సిలర్ లు యాట శివ మల్లెల సరిత శ్రీకాంత్ మౌనిక హరీష్ మంగ నరసింహులు పుట్ట మల్లేష్ బిజెపి నాయకులు తునికి దశరద వడ్డేమాన్ నరేందర్ ఐలి సందీప్ రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.