ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు పోలీసులు క్షమాపణ చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు పోలీసులు క్షమాపణ చెప్పాలి

జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లిన సందర్భంగా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్ మండిపడ్డారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో వినయ్‌భాస్కర్ కాలు, చేతికి గాయాలై రక్తం కారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల పక్షాన నిలిచి ఆసుపత్రి సమస్యలను పరిశీలించేందుకు వెళ్తే ఇలా అడ్డుకోవడం మంచిది కాదు అని అన్నారు ఎంజీఎంలో సరిపడా పడకలు లేకపోవడం, భవనం పైకప్పులు పెచ్చులూడటం, అంబులెన్సుల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పేదలకు కనీస వైద్యం అందని దుస్థితి నెలకొని ఉందని, ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. వినయ్‌భాస్కర్‌పై జరిగిన ఘటనకు పోలీసులు తక్షణమే క్షమాపణ చెప్పాలని అమ్మ అశోక్ డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివ వంశీ రేవంత్ సన్నీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్