ఆక్వా కార్యదర్శి నాగభూషణాన్ని పలువురు పరామర్శ

July 6, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 6 (ముమ్మిడివరం ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ఆక్వా కార్పొరేషన్ కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, అభిమానులు నివాళులర్పించారు.మృతుని కుటుంబ సభ్యులను పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. జనసేన నాయకులు నల్లా శ్రీధర్, చిన్న వెంకటేశ్వరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు యళ్ళ దొరబాబు, మోకా సుబ్బారావు, గోలకోటి వెంకటరెడ్డి, గ్రంధి నానాజీ, చింతపల్లి అజయ్ కుమార్, కర్రా దుర్గాప్రసాద్, రంబాల దొరబాబు, చేదురి ప్రసాద్, మద్దాల రవి, బండారు రాము పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ వాకపల్లి శీను, అరిగెల నాగబాబు, కోటిపల్లి ధర్మరాజు, తాడికాశి, సొసైటీ అధ్యక్షుడు వంగా వాసు, సొసైటీ డైరెక్టర్ గాలిదేవర గణేష్, మాగాపు మల్లేష్ తదితరులు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మృతుడు స్థానికంగా అందరితో కలిసి మెలిసి ఉండేవారని, ఆయన మృతి తీరని లోటని అన్నారు. మృతుని ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు.

🌐 Select Language:
📰 ePaper