స్తంభాన్ని ఢీ కొట్టిన బైక్ యువకుడు దుర్మరణం

జనం న్యూస్ 06 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 🇨🇭మరో యువకుడు ఆసుపత్రిలో చేరికగట్టు : ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పెంచికల్ పాడు గ్రామ శివారులో ఆదివారం ఉదయం చోటు చేసుకున్నది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెంచికలపాడు గ్రామానికి చెందిన కురువ గోవర్ధన్ నక్క ఈశ్వర్ లు గ్రామ సమీపంలో తమ గొర్ల మంద దగ్గర రాత్రి కాపలాగా ఉన్నారు. ఆదివారం ఉదయాన్నే లేచి భోజనం తీసుకురావడానికి అంటూ గొర్రెల మంద దగ్గర నుండి ద్విచక్ర వాహనంపై పెంచికలపాడు గ్రామానికి బయలుదేరారు. అయితే ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా పెంచికల్ పాడు చెరువు గట్టుపై అతి వేగంగా నడపడంతో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురిని గద్వాల ఆసుపత్రికి తీసుకువెళ్లగా కురువ గోవర్ధన్(19) మృతి చెందగా, నక్క ఈశ్వర్ తీవ్ర గాయాలు కాగా కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎస్సై తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి తండ్రి చిన్న వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.