ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులుగా సిరికొండ మధు,
సాగర్ కన్వీనర్‌గా చంద్రమౌళి నాయక్ నియామకం
జనం న్యూస్ -జూన్ 5- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులుగా సిరికొండ మధు, నాగార్జున సాగర్ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా చంద్రమౌళి నాయక్ నియమితులయ్యారు.శుక్రవారం ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు నియామక పత్రాలను అందుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమితులైన సిరికొండ మధు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా ఫోరరాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.స్వరాష్ట్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన ఉద్యమ కారులందరినీ ఏకం చేసి,వారి హక్కుల సాధన కోసం నిరంతరం అండగా ఉంటామని స్పష్టం చేశారు.తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్‌కు,ఫోరం కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు, అనంతరం నాగార్జున సాగర్ కన్వీనర్ చంద్రమౌళి నాయక్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే హైస్కూల్,కళాశాల విభాగాల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ సామాజిక సేవా రంగంలో ఉన్నానని తెలిపారు.ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం టౌన్ అధ్యక్షుడిగా,జిల్లా ఉపాధ్యక్షుడిగా నిరంతరం సామాజిక న్యాయం కోసం,ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2008 నుండి జాయింట్ యాక్షన్ కమిటీ లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి, ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించానని చంద్రమౌళి నాయక్ గుర్తుచేశారు.మలిదశ తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలకు, కేసులకు బెదరకుండా పోరాడానని,ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ప్రజాసేవ చేస్తున్నానని చెప్పారు, ఉద్యమకారుల సంక్షేమం కోసం,వారి హక్కుల సాధన కోసం నాగార్జున సాగర్ లో బలోపేతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీకి,తోటి ఉద్యమకారులకు ఈ సందర్భంగా చంద్రమౌళి నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.