రైతు వేదికలో విత్తనాల డీలర్ల సమావేశం. ..

June 5, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూన్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని బిచ్కుంద రైతు వేదికలో నియోజకవర్గ స్థాయి విత్తన డీలర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. వానకాలం సాగుకు సమాయత్తంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో డీలర్లకు ఆదేశించిన ముఖ్యమైన అంశాలు.డీలర్ల అందరూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలి.నకిలీ విత్తనాలు అమ్మితే విత్తన లైసెన్సు రద్దు చేయబడుతుంది మరియు జైలుకు పంపబడతారు.విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా రసీదు ఇవ్వాలి.ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకు మాత్రమే అమ్మాలి. అధిక ధరలకు చర్యలు తీసుకోబడతాయి.ఎరువులు రైతులకు ఎలాంటి లింకులు లేకుండా అమ్మాలి మరియు తప్పకుండా రాసీది ఇవ్వాలి.నాన్యమైన పురుగుమందులను మాత్రమే అమ్మాలి మరియు రైతులకు రసీదు ఇవ్వాలి విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ పట్టికలు మరియు రసీదు పుస్తకాలు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఎరువులను తప్పకుండా ఫర్టిలైజర్ మిషన్ ద్వారా మాత్రమే అమ్మాలి మరియు యూరియాను ఫర్టిలైజర్ యాప్ ద్వారానే అమ్మాలి.ఈ సమావేశానికి బిచ్కుంద డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు, బిచ్కుంద డివిజన్ పరిధిలోని వివిధ మండలాల వ్యవసాయ అధికారులు మరియు విత్తన, ఎరువుల మరియు‌ పురుగు మందుల డీలర్లు పాల్గొన్నారు.

    🌐 Select Language:
    📰 ePaper