కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి దరఖాస్తులు ఆహ్వానం..

August 25, 2026 | తెలంగాణ

–ఎంపీడీవో గోపాలకృష్ణ

బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ బీసీ మహిళలకు కుట్టు వృత్తి ఆధారిత ఉపాధిని ప్రోత్సహించి, కుట్టు వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి గోపాలకృష్ణ తెలిపారు.ప్రతి నియోజకవర్గానికి 1,000 యూనిట్లు చొప్పున- ఒక్కో యూనిట్ విలువ రూ. 12,000/- కాగా100% పూర్తి సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్ అందజేయబడుతుందని అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.గ్రామాలలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించాలన్నారు

🌐 Select Language:
📰 ePaper