సంకల్ప విద్యాపీఠం పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే టి ఆర్ ఆర్.
జనం న్యూస్ ఆగస్టు 25, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని సంకల్ప విద్యాపీఠ్ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా, టీ, రామ్మోహన్ రెడ్డి అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన సూచించారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ న్ని కాపాడటంలో వనమ హోత్సవం కార్యక్రమాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మున్సిపల్ చైర్మన్ రజిత, మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరిషరాం రెడ్డి, సహకారా బ్యాంకు చైర్మన్ పార్థసారథి పంతులు, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ధనశెట్టి సార్ ప్రిన్సిపల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.