​మాజీ ఏజీపీ షేక్ మహమ్మద్ అలీ సతీమణికి ₹70,000 సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

August 25, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ​నందలూరు కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన మాజీ ఏజీపీ షేక్ మహమ్మద్ అలీ సతీమణి ఖమీస్ భానుకి ఇటీవల జరిగిన శస్త్రచికిత్స నిమిత్తం మంజూరైన ₹70,000 విలువైన ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్పెషల్ ఇన్వైటీవ్ ఎగ్జి క్యూటివ్ మెంబర్, రాజంపేట పార్ల మెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ స్వయంగా స్వగృహ ముకు వెళ్లి అంద జేశారు.​ఈ సందర్భంగా మాజీ ఏజీపీ షేక్ మహమ్మద్ అలీ ఆనందం వ్యక్తం చేస్తూ, సాయి లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారి గౌరవార్థం తేనీటి విందు ఏర్పాటు చేశారు.​ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్, తోట రామయ్య, రాచూరి మురళి, వీరబల్లి జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper