కేబుల్ ఛానళ్ళ సమస్యలు పరిష్కరించండి ఐపీ టీవీలకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి మీడియా అకాడమీ ఛైర్మెన్ కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి

August 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 25 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ళు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నాయకత్వంలో పలువురు కేబుల్ ఛానళ్ళ నిర్వహకులు ఫెడరేషన్ నాయకులు సోమవారం తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ కె. శ్రీనివాస్ రెడ్డిని కలిసి కేబుల్ ఛానళ్ళ అక్రెడిటేషన్ కార్డుల సమస్య పై చర్చించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో కేబుల్ నెట్వర్క్ ద్వారా నడుస్తున్న కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని దీనివల్ల ఆయా ఛానళ్ళలో పని చేస్తున్న జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొన్నేళ్ళుగా నడుపుతున్న కేబుల్ న్యూస్ ఛానళ్ళకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో అన్యాయం చేయడం తగదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్ధిక సహాయం లేకపోయినప్పటికీ జర్నలిజం పట్ల వారికున్న మక్కువతో కష్ట నష్టాలకోడ్చి నడుపుతున్న కేబుల్ ఛానళ్ళకు ప్రభుత్వం ఇచ్చే ఏకైక అక్రెడిటేషన్లు కూడా సరిగా ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో చాలా కేబుల్ నెట్వర్క్ సంస్థలు కొత్త టెక్నాలజీతో ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) నెట్వర్క్ ద్వారా న్యూస్ ఛానళ్ళను నడుస్తున్నాయ ని, సీనియారిటీ ఉన్న ప్రతి కేబుల్ ఛానల్ తో పాటు అన్ని అర్హతలున్న కొత్త ఛానళ్ళకు ఐపీ ఆధారిత న్యూస్ ఛానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని మామిడి సోమయ్య కోరారు.కేబుల్ ఛానళ్ళ సంఖ్య, జర్నలిస్టుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో కేబుల్ చానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు తగ్గించకుండా కనీసం గతంలో ఇచ్చిన మాదిరిగా జిల్లాకు 4 రాష్ట్ర స్థాయిలో 12 కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి అన్నారు. ఇప్పటికే అన్ని అర్హతలతో అక్రెడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కేబుల్ ఛానళ్ళకు వెంటనే కార్డులు ఇవ్వాలని ఐపీ నెట్వర్క్ లో నడుస్తున్న న్యూస్ ఛానళ్ళను కూడా గుర్తించి అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అనంతరం వారు ఛైర్మన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి రవికుమార్ కో కన్వీనర్ ఎస్ రవికుమార్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు గిరిబాబు వెంకట్ కుమారస్వామి అమరేందర్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper