జర్నలిస్ట్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

June 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూన్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : జర్నలిస్ట్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా పత్రికా రంగానికి చెందిన పలువురు జర్నలిస్టు నాయకులు, విలేకరులు, స్నేహితులు హర్షాతిరేకాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రికా రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రత్యేకమైన శైలి, ప్రజా సమస్యలపై నిబద్ధత, సమాజ సేవ పట్ల ఉన్న అంకితభావంతో చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని పలువురు జర్నలిస్టులు కొనియాడారు. “ఒక మనిషిని గుర్తుంచుకోవడానికి వందేళ్లు జీవించాల్సిన అవసరం లేదు.. అతను చేసిన మంచి పనులే అతడిని చిరస్థాయిగా నిలబెడతాయి” అని పేర్కొంటూ ఆయన సేవలను అభినందించారు. అంతేకాకుండా ప్రజల పక్షాన నిరంతరం నిలబడే ధైర్యసాహసాలు, సహచర జర్నలిస్టులకు అందించే ప్రోత్సాహం, సామాన్య ప్రజల సమస్యలపై చూపే చిత్తశుద్ధి ఆయనను ప్రత్యేక వ్యక్తిత్వంగా నిలబెట్టాయని పేర్కొన్నారు. మంచి మనసుతో ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే వ్యక్తిగా శ్రీనివాస్ రెడ్డి పేరు సంపాదించుకున్నారని తెలిపారు.ప్రజాసేవలో అలుపెరుగని సేవకుడిగా, పేదల సంక్షేమం కోసం కృషి చేసే నాయకత్వ లక్షణాలు ఆయనలో స్పష్టంగా కనిపిస్తాయని కొనియాడారు. గెలుపు–ఓటములకు అతీతంగా ప్రజలతోనే తన జీవితం అనుకునే వ్యక్తిత్వం ఆయనదని అన్నారు. సమాజంలో యువతకు, జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలుస్తూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, “మీ మాట అగ్నిపర్వతం.. మీ మనసు మంచుకొండ” అంటూ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో నిండి నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరమేష్ దయాసాగర్ నాగరాజు యాదవ్ నామాల శ్రీధర్ నామాల శ్రీకాంత్ బంటు ప్రవీణ్ రాజు యాదవ్ సాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper