బూచి నెల్లి పాఠశాలలో కొనసాగుతున్న బడిబాట

June 13, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 13 -06-2026 : జహీరాబాద్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూచి నెల్లి లో మండల విద్యాధికారి మాణయ్య గ్రామ సర్పంచ్ సునీత శ్రీనివాస్ గ్రామ సెక్రెటరీ అంబికా మరియు ఉపాధ్యాయులతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమము కొనసాగింది బడిబాట కార్యక్రమములో భాగంగా గ్రామంలోని రైతు కూలీలు ఉపాధి హామీ పథకం మహిళలు డ్వాక్రా మహిళలతో క్షేత్రస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి మండల విద్యాధికారి మాణయ్య మాట్లాడుతూ పాఠశాల నిర్వాహణలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమో అంతే బాధ్యత మహిళా సంఘాలది కూడా అని అన్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళా సంఘాల అభ్యర్థులకే పాఠశాల చైర్పర్సన్ పదవి ఇచ్చారు అని గుర్తు చేశారు మహిళా చైర్ పర్సన్ ల ఆధ్వర్యంలోనే మన పాఠశాలలు కొనసాగుతున్నాయి అన్నారు మీ పిల్లలను మన ఊరు మన బడిలో చేర్పించి మన ఊరి బడి అభివృద్ధికి తోడ్పడాలన్నారు సర్కారు బడిలోనే నైపుణ్యం గల ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను మన విద్యార్థులకు బోధిస్తున్నారని అన్నారు ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు తరగతుల వారిగా గ్రూపులుగా విద్యార్థులను విభజించి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఆ గ్రూప్ బాధ్యత అప్పగిస్తున్నామన్నారు విద్యార్థుల పట్ల చదువులో ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లనే 2026 సంవత్సరానికి 10వ తరగతిలో డి .సహస్ర 540 సి .సమంతా 529 హెప్సిబా 525 ఏ .వీణ కుమారి 515 ఎం .అమూల్య 511 మార్కులు సాధించి మండల స్థాయిలో టాపర్లుగా మన విద్యార్థులు నిలిచారన్నారు తదుపరి గ్రామ సర్పంచ్ సునీత శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థుల- తల్లిదండ్రులలో భిన్నాభిప్రాయాలు ఉండేవి అని, అవి కేవలం ఉన్న అపోహ మాత్రమే అని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎక్కువ శాతం విద్యార్థులు ఉన్నతమైన స్థాయిలో , ఉద్యోగాలలో ఉన్నారన్నారు అని, నేను కూడా మన ఊరు పాఠశాలలో చదువుకొని గ్రామ సర్పంచుగా కొనసాగుతున్నాను అని చిరునవ్వుతో అన్నారు మన పిల్లలను మన ఊరి బడిలో చేర్పించి పిల్లల భవిష్యత్తుకై బంగారు బాట వేస్తాము అని, వారితో సర్కారు బడి ముద్దు-ప్రైవేటు బడి వద్దు అనే నినాదాలు చేయించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మాణయ్య గ్రామ సర్పంచ్ సున్నిత శ్రీనివాస్ గ్రామ సెక్రటరీ అంబికా ఫీల్డ్ అసిస్టెంట్ హేమలత మరియు పాఠశాల ఉపాధ్యాయులు లాలయ్య ఎం గోపాల్ మై బల్లి ఏ సురేష్ బాబు ఎన్ నర్సింలు సంజీవ్ కుమార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper