యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలి: రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
జనం న్యూస్ జూన్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వసంతనగర్ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీనిక్స్ ఫిట్‌నెస్ జిమ్ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జిమ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి నిత్య వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతి యువకుడు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే ఇటువంటి ఫిట్‌నెస్ కేంద్రాలు మరిన్ని ఏర్పడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, జిమ్ నిర్వాహకులు పృథ్వి, సుబ్రహ్మణ్యం, బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ రాజ్‌పుత్, కూకట్‌పల్లి క్రిస్టియన్ మైనారిటీ సెల్ కోఆర్డినేటర్ మేకల మైఖేల్, ఏఎంసీ డైరెక్టర్ ఫణీంద్ర కుమార్, కూకట్‌పల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కలికోట శంకర్, మహిళా సీనియర్ నాయకులు వనజ, స్వాతి రెడ్డి, కోమలి, టీమ్ ఎస్‌ఎస్‌ఆర్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొని నూతన జిమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.