వర్షం వస్తుందనే హెచ్చరికలతో అయిజ మొక్కజొన్న కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్

May 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 18 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఉన్న 70000 మొక్కజొన్న స్టాకును తరలించేందుకు గత మూడు రోజులుగా జిల్లాలోని అన్ని శాఖల ముఖ్య అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ స్టాకు విలువ చేసేందుకు ఐజ పట్టణంలోని జిన్నింగ్ మిల్లుల యజమానులతో అగ్రిమెంట్ చేసుకునేందుకు గోదాముల కాంట్రాక్ట్ ఏజెన్సీలు చేస్తున్న జాప్యం వల్ల రైతులకు ఇబ్బంది తప్పడం లేదు. ఈరోజు సాయంత్రం ఉరుములతో కూడిన చిరుజల్లులు కురవటంతో రైతుల్లో ఆందోళన పెరిగిందిఈ విషయాన్ని గ్రహించిన జిల్లా కలెక్టర్ వెంటనే అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మధుమోహన్ ని పంపారు.కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవడం లేట్ అయితే వెంటనే వాటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని వెంటనే లారీలు పక్షంలో రైతుల ట్రాక్టర్లతో సరుకు ను ఐజ పట్టణంలోని ఎంపిక చేసిన గోదాములకు తరలించాలని ఆదేశించారు గోదాముల కొరతనే రైతులను వేధిస్తుంది వాటిని కేటాయిస్తే ట్రాక్టర్లు డీసీఎంలు ఇతరత్రా వాహనాల ద్వారా కాంటావేసిన మొక్కజొన్న బస్తాలను తరలిస్తామని సింగిల్విండో చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి అన్నారు అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తాసిల్దార్ జ్యోతి వెంటనే ఆయా జిన్నింగ్ మిల్ యజమాలతో మాట్లాడి ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రేటు ప్రకారం ఒప్పుకొని గోదాములు స్వాధీనం చేయాలని ప్రభుత్వం ఏదైనా రేటు పెంచితే దాని ప్రకారమే మీ బాడుగ సంబంధిత శాఖ అధికారులు చెల్లిస్తారని జిన్నింగ్ యజమాలకు తెలపగా అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని రైతులు కొంత సయమనం పాటించాలని ఆమె కోరారు.

🌐 Select Language:
📰 ePaper