శాయంపేట మండల ప్రజలు 108 అత్యవసర సేవలను సద్వినియోగం చేసుకోవాలి.హనుమకొండ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్

September 3, 2026 | వైరల్ వార్తలు

ఈరోజు శాయంపేట మండల కేంద్రంలోని108 అంబులెన్సు ను శ్రీ మండ శ్రీనివాస్ 108 జిల్లా మేనేజర్ తనిఖీ చేశారు.


శాయంపేట మండలంలోని ప్రతి గ్రామానికి చెందిన ప్రజలు108 అత్యవసర సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు .
అలాగే ఈ వర్షాకాలంలో విషపురుగుల కాటులకు గాని , వర్షాకాలంలో ప్రభలే వివిధ వ్యాధులకు గాని, గర్భిణి స్త్రీల కొరకు గానీ మరియు కరెంట్ షాక్ ,యాక్సిడెంట్లు కానీ మరియు మెడికల్ అత్యవసరాల కోసం 108 అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు .అలాగే మండల ప్రజలు 108 కి కాల్ చేయగానే సత్వరమే అంబులెన్స్ ని 30 సెకండ్లలోస్టార్ట్ చేసి సరియైన సమయానికి వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించి దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించగలరని సిబ్బందికి సూచించారు.ఈ సంవత్సరం జనవరి నెలలో118 ఫిబ్రవరి నెలలో 89 మార్చ్ నెలలో 79 ఏప్రిల్ నెలలో 77 మే నెలలో100 జూన్ నెలలో 76 జూలై నెలలో 81ఆగస్టు నెలలో 115 మంది మరియు నుండి ఆగస్టు వరకు 735 ప్రాణాలు కాపాడినందుకు 108 సిబ్బందిని అభినందించారు.అంబులెన్స్ లో అన్ని రకాల రికార్డ్స్ లను మరియు మెడికల్ పరికరాలను , అత్యవసరంలో వాడే మెడిసిన్స్ లను పరిశీలించారు.108 అంబులెన్స్ లో వచ్చిన ప్రతి పేషెంట్ కి మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని సూచించారు.ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో నవజాత శిశువుల కోసం నియోనెటల్ అంబులెన్స్ ఉంది కావున ఇప్పుడే పుట్టిన శిశువుల దగ్గర నుండి సంవత్సరం వరకు ఎలాంటి ప్రమాదాలకు గురైన మరియు నవజాత శిశువు బరువు తక్కువగా పుట్టడం ,శ్వాస సంబంధించిన మరియు ఫీట్స్ చిన్నపిల్లల్లో ఎలాంటి ఆపద వచ్చిన 108 కి కాల్ చేసి నవజాత శిశువు అంబులెన్స్ కావాలని చెప్పాలి. ఈ నవజాత శిశువు అంబులెన్స్ లో అత్యధిక టెక్నాలజీ తోటి వెంటిలేటర్, ఇంకు బెటర్, సిరంజి పంపు, ఎఈ డి మిషన్, సెక్షన్ఆపరేటర్ ఇలాంటి సర్వీసును మరియు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు గానీ మరియు హైదరాబాదులోని నీలోఫర్ హాస్పిటల్ గాని ఉచితంగా వైద్య సేవలు చేసుకుంటూ ఆసుపత్రికి తీసుక వెళ్తారు. ఇలాంటి చిన్నపిల్లల సర్వీసును శాయంపేట మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలొ శాయంపేట పిఎచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కృష్ణ మరియు 108 ఈఎంటిలు మదిశెట్ట్ అనిల్, ,పైలెట్లు ఆకుల పూర్ణచందర్,గార్లు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper